ETV Bharat / sitara

'పండగలొస్తే అవే గుర్తుకు వస్తాయి' - పండగల గురించి పూజా హెగ్డే

సినీ తారలు ఎప్పుడూ షూటింగ్​లతో బిజీగా గడుపుతుంటారు. అయితే తీరిక లేని సమయాల్లోనూ ఇంట్లో పండగలు ఎలా జరుపుకొంటారని పూజా హెగ్డేను ప్రశ్నించగా ఇలా స్పందించింది.

'పండగలొస్తే అవే గుర్తుకు వస్తాయి'
'పండగలొస్తే అవే గుర్తుకు వస్తాయి'
author img

By

Published : Aug 20, 2020, 8:22 AM IST

సినీ తారలు నిత్యం చిత్రీకరణలతో ఎంత హడావిడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. తీరిక లేని సమయాల్లోనూ ఇంట్లో పండగలు ఎలా జరుపుకొంటారని పూజా హెగ్డేను అడగగా ఇలా జవాబు చెప్పుకొచ్చింది.

"నేను ముంబయిలో పుట్టిపెరిగా. కానీ మా ఇంట్లో మొత్తం దక్షిణాది వాతావరణమే కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో చేసే పండగలన్నింటినీ వేడుకగా జరుపుకొంటాం. సంక్రాంతి అనగానే నాకు మొదటగా మా అమ్మ చేసే లడ్డూలే గుర్తుకు వస్తుంటాయి. కానీ గాలిపటాలతో సరదాగా ఆడుకున్నది తక్కువనే చెప్పాలి. ఇక దసరా నవరాత్రుల్లోనైతే మా ఇంట్లో భజన ఉంటుంది. నేను షూటింగ్‌ కారణంగా ఎక్కడున్నా సరే ఆ తొమ్మిది రోజులు ఉదయం పూట భజన చేస్తుంటా. సినిమాల వల్ల పండగల పూట ఇంటికి దూరంగా గడపాల్సి వస్తోంది. కానీ వీలు చిక్కితే వెంటనే ఇంట్లో వాలిపోతా"

-పూజా హెగ్డే, నటి

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించి ఘనవిజయాన్ని అందుకుంది పూజ. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన 'రాధేశ్యామ్‌' చిత్రంలో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.