పూజాహెగ్డే ఈ ఏడాది మొదట్లోనే 'అల వైకుంఠపురములో' చిత్రంతో హిట్ కథానాయికగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో కథానాయకుడిగా మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. కథానాయికగా పూజా హెగ్డే నటించనుందని సమాచారం. ఇప్పటికే ఆమెకి కథను వినిపించారట. అందుకు పూజ కూడా అంగీకరించిందని కూడా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. లాక్‌డౌన్ పూర్తి కాగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. పూజ తెలుగులో ప్రభాస్‌తో కలిసి ఓ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం చేస్తోంది. ఇక అక్కినేని అఖిల్‌తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో విభ అనే పాత్రలో నటిస్తోంది. ఇందులో అఖిల్.. నాగరాజ్ పాండేగా అలరించనున్నాడు.