ETV Bharat / sitara

సుశాంత్​తో భన్సాలీ అందుకే సినిమాలు చేయలేదు!

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సుశాంత్ చేయాలనుకున్న నాలుగు సినిమాలు ఆగిపోవడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. భన్సాలీని ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయాలు బయటకొచ్చాయి.

సుశాంత్​తో భన్సాలీ అందుకే సినిమాలు చేయలేదు!
సుశాంత్ సింగ్-సంజయ్ లీలా భన్సాలీ
author img

By

Published : Jul 7, 2020, 2:52 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నించిన పోలీసులు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. గతంలో సుశాంత్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే, ఈ డైరెక్టర్ అతడితో చేయాలనుకున్న నాలుగు సినిమాలు ఆగిపోయావని వెల్లడించారు. దీంతో ఆ చిత్రాలు వేరేవారితో చేయాల్సి వచ్చిందని తెలిపారు.

జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు సుశాంత్. ఇది సుసైడ్ అని పోస్ట్ మార్టమ్​లో తేలినప్పటికీ, వృత్తిపరమైన కక్షలు ఏమైనా ఉన్నాయేమోనని భావించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ మృతితో సంబంధముందనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు 34 మందిని ప్రశ్నించారు. వీరిలో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర నటీనటులు ఉన్నారు.

దీనితోపాటే సుశాంత్ నివసించిన భవంతికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తను ఉరివేసుకున్న తాడును.. ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.