ETV Bharat / sitara

Kareena Kapoor: హీరోయిన్ కరీనా కపూర్​పై పోలీస్ కేసు

author img

By

Published : Jul 14, 2021, 7:05 PM IST

ప్రముఖ కథానాయిక కరీనా కపూర్​పై పోలీస్ కేసు నమోదైంది. ఆమె రాసిన పుస్తకం టైటిల్​ తమ మనోభావాల్ని కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేశారు.

Police complaint filed against Kareena Kapoor in Beed over book title
కరీనా కపూర్​

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్​పై పోలీసు కేసు నమోదైంది. తన ప్రెగ్నెన్సీ అనుభవాల ఆధారంగా రాసిన ఓ పుస్తకాన్ని కరీనా ఇటీవల విడుదల చేసింది. ఆ బుక్​ టైటిల్​, తమ మతం మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని ఓ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు.

ఇంతకీ ఏమైంది?

ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన ముద్దుగుమ్మ కరీనా.. అతడికి 'జే' అనే పేరు పెట్టినట్లు ఈ మధ్య వెల్లడించింది. తనకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఎదురైన మానసిక, శారీరకంగా ఎదురైన సమస్యలను 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకంగా రాసింది. దానిని జులై 9న విడుదల చేసింది. ఇది తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా చెప్పుకొచ్చింది.

Police complaint filed against Kareena Kapoor
హీరోయిన్ కరీనా కపూర్

అయితే 'బైబిల్​' అనే పేరు తమ మనోభావాల్ని దెబ్బితీస్తోందని ఆల్ఫా ఒమెగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే.. శివాజీ నగర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసినప్పటికీ, ఎలాంటి ఎఫ్​ఐఆర్ నమోదు కాలేదని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ సంఘటన ఇక్కడ జరగనందున, ముంబయి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని వాళ్లకు సూచించినట్లు ఇన్​స్పెక్టర్ సాయినాథ్ చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.