Tanzania siblings reels: టిక్ టాక్.. ఒకప్పుడు ఇదొక సంచలనం. మొబైల్లో తప్పని సరి అప్లికేషన్. దాదాపు దేశంలోని 80శాతం మంది ఈ అప్లికేషన్‌కు కస్టమర్లు ఉన్నారు. అందులో ఎక్కువ శాతం టిక్ టాక్ విడియోలకు అభినయించేవారు. అనంతరం చైనా వ్యవహారంలో ఆ దేశానికి చెందిన టిక్ టాక్ అప్లికేషన్ ను భారత్ బ్యాన్ చేసింది. అ తర్వాత ఫేస్ బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్...రీల్స్ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులో ఉంది. రోజుకు కొన్ని కోట్ల విడియోలు అందలో డంప్ అవుతుంటాయి. కొత్తదనంగా ఏ వీడియో కనిపించినా అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప లోని డైలాగ్ లు, పాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. పలు దేశాల పౌరులు, క్రికెటర్లు, ప్రముఖులు వాటికి రీల్స్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తెలిసిన భాషకు రీల్స్‌లో అభినయించాలంటే సులభంగానే ఉంటుంది. అదే తెలియని ప్రాంతం, భాష, రిథమ్ అయితే ఆ రీల్స్ కి లిప్ సింక్, నృత్యం చేయడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం భారత్ లో విడుదల అవుతున్న సినిమాలు, అందులోని సంభాషణలు, పాటలపై విదేశీయులు తెగ ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా సరే రిథమ్ బాగుంటే చాలు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పోటీగా రీల్స్ చేస్తున్నారు. అలాంటి వారే టాంజానియాకు చెందిన అక్కాతమ్ముళ్ళు కిలి పాల్, నీమ పాల్. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వీరు సంచలనం. కిలి పాల్ కు 2.6మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
సన్మానం
టాంజానియా మాసాయి తెగకు చెందిన ఈ అక్కా తమ్ముళ్ళు స్థానికంగా వ్యవసాయ పనులకు వెళుతుంటారు. స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన తర్వాత...తొలుత స్థానిక భాషల్లో టిక్ టాక్ వీడియోలు చేశారు. టిక్ టాక్ బ్యాన్ అవ్వడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించారు. ఒకసారి మెలోడి సాంగ్ కోసం వెతకగా బాలీవుడ్ నటుడు సిద్దార్ధ మల్హోత్రా నటించిన షేర్షా సినిమాలో జెబిన్ నాట్యుల్ ఆలపించిన రాతాన్....లంబియా లంబియా రే... అనే పాట నచ్చడం వల్ల ఆ పాటకు పెదవులు ఆడించారు. అచ్చం పాటలాగానే సింక్ చేశారు. దీనిని ఆ సినిమా కథానాయిక కియారా అడ్వాణీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. భారత్‌లో విపరీతంగా వైరల్ కావడం వల్ల వారిద్దరికీ ఫాలోవర్లు పెరిగారు. దీంతో అన్ని పాపులర్ పాటలకు డబ్ చేస్తూ వీడియోలు చేయడం ప్రారంభించారు.
భారతదేశ సంగీతం చాలా బాగుంటుందని.. ఆ పాటలు ఎంతగానో నచ్చుతాయని వారిద్దరు చెబుతున్నారు. ఒక్కో పాటకు దాన్ని ఎలా పలకాలో గూగుల్‌లో తెలుసుకుని వారం పాటు సాధన చేసి వీడియోలు చేస్తామని..అది మాకు అంత కష్టంగా అనిపించదని చెబుతున్నారు. ముఖ్యంగా జబిన్ పాటలు అంటే వారికి ఎంతో ఇష్టమని చెబుతారు. అలా భారత్ పై అమితమైన ప్రేమను పెంచుకున్నారు. రాజమౌళి నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు కూడా కిలి పాల్ స్టెప్పులు వేశారు. పుష్ప పాటలకు కూడా నృత్యం చేసి అదరకొట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ గీతం, లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా ఆమె పాటను ఆలపించి భారత్ పట్ల వారి అభిమానాన్ని పంచుకున్నారు. ఈ విషయాన్ని తెసుకున్న ప్రధాని మోదీ వారిని టాంజానియాలోని భారత రాయబార కార్యాలయానికి పిలిపించి సన్మానించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మన్ కీ బాత్‌లో వారిపై ప్రశంసలు
దేశంలోని పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో వీరి ప్రస్తావన వచ్చింది. దేశం మీద, దేశ సంగీతం మీద ఎంతో ఆసక్తి చూపుతున్న ఇద్దరు తోబుట్టువులను మీకు పరిచయం చేయబోతున్నాను అంటూ కిలి పాల్, నీమా పాల్ ను గురించి మోదీ చెప్పారు. భారత దేశ సంస్కృతి, సంగీతం ఎంతో గొప్పది అనడానికి ఇదొక నిదర్శనం...వీరిద్దరే కాదు పలు దేశాల క్రికెటర్లు, ప్రముఖులు భారతీయ పాటలకు ముగ్దులవుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: 'కచ్చా బాదమ్' సింగర్‌కు రోడ్డు ప్రమాదం!