'ప్లేబ్యాక్' సినిమా ముందుగా తానే చేయాల్సి ఉండేదని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. లాజిక్ ఉన్న ఇలాంటి కథలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుందని ఆయన అన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ తరహాలో మన దగ్గర కూడా పాన్ ఇండియా కథలు రాసేవాళ్లున్నారన్నారు.
తన స్నేహితుడు హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహించిన 'ప్లేబ్యాక్' చిత్రం విజయవంతం కావడం పట్ల సుక్కు హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో పునర్నిర్మితం కానుండటం ఎంతో గర్వంగా ఉందన్నారు.
తెలుగు సినిమాల్లో తెలుగు నటీనటులను ప్రోత్సహిస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. దినేశ్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండు కాలాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంగా తెరకెక్కింది.
ఇదీ చూడండి: స్క్రీన్ప్లే రాయడానికే ఏడాది పట్టింది: హరిప్రసాద్