'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన 'అర్జున్ సురవరం'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో కలిసి 'ఏ1 ఎక్స్‌ప్రెస్'లో హాకీ ప్లేయర్‌గా అలరించనుంది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈ భామ.. సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రేక్షకులు.. హీరోయిన్ల గ్లామర్‌ను పట్టించుకొనే రోజులు పోయాయని చెప్పింది.
"టాలీవుడ్‌లో కథానాయికలను కేవలం గ్లామర్ గర్ల్‌గా చూసే రోజులు పోయాయి. ఎక్కువ మంది రచయితలు, దర్శక నిర్మాతలు హీరోయిన్ ఓరియెంటెడ్‌కు సంబంధించిన కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేక్షకులూ.. హీరోయిన్ల నటనను ఆస్వాదించేందుకే ఇష్టపడతున్నారు"
-లావణ్య త్రిపాఠి, హీరోయిన్
'ఏ1 ఎక్స్‌ప్రెస్'.. తెలుగులో హాకీ నేపథ్యంలో రాబోతున్న తొలి సినిమా. హిప్ హాప్ తమిజ సంగీతం సమరకూర్చనున్నాడు. డెన్నిస్ జీవన్ దర్శకుడు. ఇందులో లావణ్య.. హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది.