ETV Bharat / sitara

'కంగన విజయాన్ని చూసి వారికి అసూయ' - కంగనా చూసి వారికి అసూయ

బాలీవుడ్​లో బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న హీరోయిన్​ కంగనా రనౌత్​కు మద్దతుగా నిలిచారు సీనియర్​ నటుడు శత్రుఘ్నసిన్హా. అన్యాయంపై ఆమె చేస్తోన్న పోరాటం చూసి.. గిట్టనివాళ్లు అసూయ పడుతున్నారని అభిప్రాయపడ్డారు.

kangana
కంగనా
author img

By

Published : Jul 25, 2020, 5:11 PM IST

Updated : Jul 25, 2020, 5:35 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్.. చిత్రసీమలో నెపోటిజమ్​ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని హీరోయిన్​ కంగనా రనౌత్​ సహా పలువురు సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనకు మద్దతుగా నిలిచారు సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా. బంధుప్రీతిపై నటి చేస్తోన్న వ్యాఖ్యలన్నీ సమర్థనీయమైనవని అన్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చిత్రసీమలో జరుగుతోన్న అన్యాయాలపై ఆమె ధైర్యంగా పోరాడి విజయం సాధిస్తుంటే.. దాన్ని చూసి గిట్టనివారికి అసూయ పుడుతోందని సిన్హా అభిప్రాయపడ్డారు. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతుకలన్నీ ద్వేషంతో నిండిపోయినవని అన్నారు.

దీంతోపాటు నెపొటిజమ్​కు వ్యతిరేకంగా మాట్లాడుతోన్న కంగన సహా తాప్సీ, తన కూతురు, హీరోయిన్​ సోనాక్షి సిన్హాపై ప్రశంసలు కురిపించారు సిన్హా.

కరణ్​పై విమర్శలు

నిర్మాత కరణ్​ జోహర్​పై విమర్శలు గుప్పించారు శ్రతుఘ్నసిన్హా. అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించే 'కాఫీ విత్​ కరణ్​' కార్యక్రమం అర్థంపర్థం లేని షో అని అన్నారు. ఇటువంటి షోల కారణంగా వివాదాలు కూడా తలెత్తుతాయని వెల్లడించారు.

ఇది చూడండి : అవార్డు రాజకీయాలపై తమన్నా కీలక వ్యాఖ్యలు

Last Updated : Jul 25, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.