ETV Bharat / sitara

సినీ డైరీ: 'పెళ్లి సందడి' పాట 'గంగోత్రి'లో!

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డైరెక్టర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్​లో ఎన్నో చిత్రాలు మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. ఇందులో 'పెళ్లి సందడి', 'గంగోత్రి' కూడా ఉన్నాయి. అయితే మొదటగా 'పెళ్లి సందడి'లో అనుకున్న పాట 'గంగోత్రి'కి సెట్ అయిందట.

Pelli Sandhadi song was used for Gangotri movie
సినీ డైరీ: 'పెళ్లి సందడి' పాట 'గంగోత్రీ'లో!
author img

By

Published : Nov 8, 2020, 9:31 AM IST

Updated : Nov 8, 2020, 11:51 AM IST

సంగీత దర్శకుడు ఓ సినిమా కోసం కట్టిన బాణీ మరో చిత్రంలో ఉపయోగించడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. ఏదైనా చిత్రంలోని కీలక సన్నివేశం కోసం సంగీత దర్శకుడు కొన్ని స్వరాలు వినిపించగా.. ఇంకా బాగా ప్రయత్నిద్దాం అంటూ మరికొన్ని రాగాలు కావాలంటారు దర్శకులు. అలా కొన్ని పాటలు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం కీరవాణి, డైరెక్టర్‌ రాఘవేంద్రరావు విషయంలో ఇదే జరిగింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు మ్యూజికల్‌ హిట్‌గా నిలిచాయి. వీళ్ల కాంబోలో వచ్చిన 'పెళ్లి సందడి' చిత్రంలోని క్లైమాక్స్‌ పాట కోసం కీరవాణి ఎన్ని ట్యూన్లు కట్టారో తెలుసా? 33 ట్యూన్లు. 32ట్యూన్లు రాఘవేంద్రరావుకు నచ్చినా ఇంకేదో కావాలనడం వల్ల 33వ రాగం వినిపించి ఓకే అనిపించుకున్నారు కీరవాణి. 33వ బాణీనే 'హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ.. ప్రేమ'. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మిగిలిన 32లోని ఓ బాణీని 'గంగోత్రి' చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌గా వినిపించారు. 'కన్నీటిని పన్నీటిగా చేసి.. కష్టాలను ఇష్టాలుగా మార్చి.. కాలమనే కడలిలో పూవుల నావగా సాగేవూ.. ప్రేమ నువ్వు ఎంత వింత జాడవే' అంటూ ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Nov 8, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.