‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కడతాయనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. కొన్ని నెలలపాటు ఎదురుచూసిన పాయల్‌కు ఇప్పుడిప్పడే ఆఫర్లు వస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఆమెకు యువహీరోల సినిమాల్లో కాకుండా సీనియర్ కథానాయకులతో నటించే అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ‘వెంకీ మామ’లో విక్టరీ వెంకటేశ్ సరసన, రవితేజతో ‘డిస్కో రాజా’లో నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ త్వరలో ప్రారంభించనున్న సినిమాలోనూ పాయల్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే పెద్ద హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమైన తరుణంలో పాయల్ వారికి మంచి ఛాయిస్‌లా కనిపిస్తోంది.
ఇది చదవండి: కాజల్‌ను చూసి చూపు తిప్పుకోగలరా..!