దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఆరోపణలు చేసింది. అందువల్ల తనకు 'వై' లెవల్ సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు లేఖ రాసింది. తన న్యాయవాదికి కూడా భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌కు "నిందితుడు ఇంకా జైలులో ఉండకుండా స్పేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడి నుంచి నాకు ప్రాణహాని ఉంది" అని వ్యాఖ్య జోడించింది. అంతకుముందు ఇదే విషయంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశారిని కలిసి వినతి పత్రం అందజేసింది పాయల్.
-
Today 5/10/2020 Letter issued to @AnilDeshmukhNCP for Security for @iampayalghosh & @Nitin_Satpute pic.twitter.com/IVZdY1sjkF
— Adv Nitin Satpute ایڈوکیٹ نتن ستپوتے નિતિન સાતપુતે (@Nitin_Satpute) October 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today 5/10/2020 Letter issued to @AnilDeshmukhNCP for Security for @iampayalghosh & @Nitin_Satpute pic.twitter.com/IVZdY1sjkF
— Adv Nitin Satpute ایڈوکیٹ نتن ستپوتے નિતિન સાતપુતે (@Nitin_Satpute) October 5, 2020Today 5/10/2020 Letter issued to @AnilDeshmukhNCP for Security for @iampayalghosh & @Nitin_Satpute pic.twitter.com/IVZdY1sjkF
— Adv Nitin Satpute ایڈوکیٹ نتن ستپوتے નિતિન સાતપુતે (@Nitin_Satpute) October 5, 2020
ఇదీ జరిగింది
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఇటీవలే ఆరోపణలు చేసింది. చాలా ఏళ్ల క్రితం అతడిని కలిసినప్పుడు అసౌకర్యానికి గురైనట్లు చెప్పిన ఆమె వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
"అనురాగ్ అలాంటి వ్యక్తి కాదంటూ.." అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల అనురాగ్‌పై పాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (ఐ), 354, 341, 342 కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అనురాగ్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు.. అక్టోబర్ 1న దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. 2013లో పాయల్ వేధింపులు జరిగాయని ఆరోపించిన నాడు తాను అసలు భారత్‌లోనే లేనని దర్శకుడు ఆధారాలు చూపించాడని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
దీంతో కశ్యప్ అబద్ధం చెబుతున్నాడని సోషల్‌మీడియాలో ఆరోపించింది పాయల్. అతడి వద్ద నుంచి నిజాలు రాబట్టడానికి పాలిగ్రాఫ్ పరీక్ష లేదా నార్కో విశ్లేషణ నిర్వహించాలని ఆమె కోరింది.