బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి కొందరు హీరోయిన్లు బయటపెట్టిన నిజాలు సంచలనం రేపాయి. తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేసింది. కశ్యప్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ చెప్పింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన పాయల్ ట్విట్టర్లోనూ ప్రధానమంత్రి మోదీని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.
"నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నా. నాకు కథ చెబుతానని అనురాగ్ కశ్యప్ గదిలోకి తీసుకెళ్లాడు. అప్పుడు అతడు 'బాంబే వెల్వెట్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంలో నటించాలనుకునే అమ్మాయిలు తనతో గడపాలని చెప్పాడు. అతడితో సన్నిహితంగా ఉంటే భవిష్యత్‌లో ఆఫర్లు వస్తాయని అన్నాడు. సినీ ఇండస్ట్రీలో శారీరక సంబంధం పెద్ద తప్పేమీ కాదన్నాడు. ఆ సమయంలో నన్ను బలవంతం చేయబోయాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు."
-పాయల్ ఘోష్, సినీ నటి
దీనిపై స్పందించిన జాతీయ మహిళా సంఘం ఛైర్మన్ రేఖా శర్మ అందుకు సంబంధించిన వివరాలు తమకు పంపాల్సిందిగా కోరారు. దీనిపై విచారణ చేపడతామని భరోసా ఇచ్చారు.
కశ్యప్‌ను అరెస్ట్ చేయండి
ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా స్పందించింది. అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇప్పటికే కంగన, అనురాగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 'కంగన నీవో యోధురాలు.. వెళ్లి చైనాతో పోరాడు' అంటూ కశ్యప్ వ్యంగంగా కామెంట్ చేయగా దానికి గట్టిగానే బదులిచ్చింది 'క్వీన్' నటి. 'దేశానికి గోల్డ్ మెడల్ అవసరం. నువ్వు ఒలింపిక్స్‌కు వెళ్లు' అంటూ విమర్శలు చేసింది.
-
Every voice matters #MeToo #ArrestAnuragKashyap https://t.co/Pv1kGZIRr6
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Every voice matters #MeToo #ArrestAnuragKashyap https://t.co/Pv1kGZIRr6
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020Every voice matters #MeToo #ArrestAnuragKashyap https://t.co/Pv1kGZIRr6
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'ఊసరవెల్లి'లోనూ నటించింది. పలు సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాలేదు.