ETV Bharat / sitara

నటి పాయల్ అవయవదానం.. ఆ సంఘటనే కారణం - ఊసరవెల్లి పాయల్ ఘోష్

తన స్నేహితుడి మరణంతో చలించిపోయిన నటి పాయల్ ఘోష్.. తానూ చనిపోయిన తర్వాత అవయవదానం చేస్తానని స్పష్టం చేసింది. ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.

స్నేహితుడి మరణం.. అవయవదానానికి పాయల్ సిద్ధం
నటి పాయల్ ఘోష్
author img

By

Published : Jul 17, 2020, 7:56 AM IST

Updated : Jul 17, 2020, 11:58 AM IST

ఇటీవలే తన స్నేహితుడిని కోల్పోయానని, అలాంటి అభాగ్యుల కోసం తాను చనిపోయిన తర్వాత అవయవదానం చేయాలనుకుంటున్నానని బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ చెప్పింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

Payal Ghosh Pledges To Donate Her Organs
నటి పాయల్ ఘోష్ ట్వీట్

"నా స్నేహితుడొకరు మూత్రపిండాల జబ్బుతో బాధపడుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అవయువ దాతలు లభించక ప్రాణాలు వదిలేశాడు. ఈ సంఘటన ఎంతో బాధించింది. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. నా మరణాంతరం అవయవాలను దానం చేయాలని నిశ్చయించుకున్నాను. మీరూ ఓ జీవితాన్ని కాపాడాటానికి అవయవదానం చేయండి. మనం చనిపోయిన తర్వాత ప్రపంచంలోని ఏ ఆసుపత్రిలోనైనా కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవదానం చేయొచ్చు. మరణం అనంతరం వేరొకరికి జీవితాన్ని ఇవ్వొచ్చు" అని పాయల్ ఘోష్ రాసుకొచ్చింది.

payal ghosh
నటి పాయల్ ఘోష్

పాయల్‌ ఘోష్‌.. తెలుగులో మంచు మనోజ్‌తో కలిసి ‘ప్రయాణం’ సినిమాలో కథానాయికగా నటించింది. జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'లోనూ సహాయ పాత్రలో కనిపించింది. దివంగత రిషి కపూర్‌తో, 2017లో వచ్చిన 'పటేల్‌ కి పంజాబీ షాదీ'లో కీలక పాత్ర పోషించింది.

Last Updated : Jul 17, 2020, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.