ఈ కొత్త ఏడాదిలో సినీప్రియుల కోసం తెలుగు చిత్రసీమ కొత్త రుచులను సిద్ధం చేస్తోంది. వీటిలో పవన్ కల్యాణ్ రీఎంట్రీ చిత్రం 'పింక్' రీమేక్, 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న 'జాన్', విక్టరీ వెంకటేశ్ చేయబోయే 'అసురన్' రీమేక్ వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.
ఈ సినిమాలన్నీ సంక్రాంతి తర్వాత ఒకే రోజు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయట. ఇంతకీ అదెప్పుడో కాదు.. జనవరి 20నే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే 'అసురన్' రీమేక్‌ను ఈనెల 20 నుంచి అనంతపురం జిల్లాలో చిత్రీకరించబోతున్నారట. కథ రీత్యా ఈ సినిమాలో అత్యధిక భాగాన్ని రాయలసీమ ప్రాంతంలోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇక అదే రోజున హైదరాబాద్‌లో పవన్, ప్రభాస్‌లు కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి చిత్రాల కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్లు రూపొందించారు. పవన్.. 'పింక్' రీమేక్ కోసం లాయర్‌గా ఈ 20నే కోర్టు హాల్లో అడుగుపెట్టనుండగా.. అదే రోజు ప్రభాస్ తన 20వ చిత్రం 'జాన్' కోసం యూరోప్ సెట్లోకి వెళ్లబోతున్నాడట.
ఇవీ చూడండి.. 2019లో కలిసొచ్చారు.. 2020లో పోటీ పడుతున్నారు