పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా.. తండ్రి బాటలోనే నడుస్తాడని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. అకీరాకి హీరో కావాలని లేదని తల్లి రేణూ దేశాయ్ పలుమార్లు చెప్పినా.. ఇటీవల విడుదలైన వీడియో మాత్రం అభిమానుల ఆశలే నెరవేరుతాయని తెలుపుతోంది.
ఇటీవల రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో అకీరా.. కర్రసాము చేస్తున్నాడు. పవన్ కూడా కరాటే, కుంగ్ ఫులో శిక్షణ తీసుకుని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అకీరా కూడా కర్రసాము చేస్తుండగా.. తండ్రి బాటలోనే తనయుడు అని అందరూ అనుకుంటున్నారు. పవన్‌లాగే అకీరా కూడా సినిమాల్లో రాణిస్తాడని విశ్వసిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కరోనా లాక్డౌన్ సమయంలో అకీరా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఓ టీచర్ దగ్గర చేరాడు. ఈ టీచర్‌తో తండ్రి కొడుకులు ఓ ఫొటో దిగారు. దానిని ఆ టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అయింది.
ఇదీ చదవండి:పవన్ సినిమా సంక్రాంతికే.. ప్రభాస్, మహేశ్‌తో పోటీ