Pawan kalyan sai dharam tej remake: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే వెంకటేశ్‌తో 'గోపాల గోపాల', రానాతో 'భీమ్లా నాయక్' చేశారు. ఇప్పుడు తన ఫ్యామిలీలో హీరో, మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు! ఈ విషయం దాదాపు ఖరారైంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.
తమిళంలో గతేడాది ఓటీటీలో విడుదలైన సినిమా 'వినోదయ సితమ్'. సముద్రఖని దర్శకత్వం వహించడం సహా కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తెలుగులోనూ ఆయనే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
![Pawan Kalyan- saidharam tej](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14365468_pawan-saidharam-tej.jpg)
పవన్ 'భీమ్లా నాయక్' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌తో పవర్‌స్టార్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత 'భవదీయుడు భగత్‌సింగ్' చేస్తారు. మరోవైపు సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం ఓ మిస్టరీ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: