పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్‌తో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు సమాచారం.
ఎలాంటి మీడియా హడావుడి లేకుండా దిల్‌రాజు ఆఫీస్‌లో ఈ ప్రారంభ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ హీరో లేకుండానే సినిమాను ప్రారంభించిందట చిత్రబృందం. జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, ఫిబ్రవరి నుంచి పవన్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటి నుంచే ప్రీప్రొడక్షన్ పనులను ముమ్మరం చేస్తున్నారట. ఈ చిత్రంలో పవర్‌స్టార్ లాయర్‌గా కనిపించనున్నాడు. సమంత, నివేదా థామస్లలో ఎవరో ఒకరు హీరోయిన్గా నటించవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవీ చూడండి.. చెల్లి పెళ్లికి ప్రియుడితో కలిసి వచ్చిన ఫ్రిదా