ETV Bharat / sitara

Pawan kalyan movies: యువ డైరెక్టర్​తో పవన్​ సినిమా - పవన్​కల్యాణ్ మంచు మనోజ్

పవర్​స్టార్ మరో యంగ్​ డైరెక్టర్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతం అతడు కథ వినిపించారు. అయితే అంగీకరించారా లేదా అనేది త్వరలో స్పష్టత రానుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే?

pawan kalyan movie with anil ravipudi
పవన్‌కల్యాణ్
author img

By

Published : Oct 14, 2021, 9:04 PM IST

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 'భీమ్లానాయక్‌' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 'హరిహర వీరమల్లు' కొంతమేర షూటింగ్‌ పూర్తయింది. హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌ సింగ్‌' కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్‌ ఓ సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో డైరెక్టర్‌ చేరినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఓ కథను డైరెక్టర్ అనిల్‌ రావిపూడి పవన్‌కు వినిపించారట. కథ విన్న పవన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే, వరుస సినిమాలు ఉండటం వల్ల ఓకే చెప్పారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత రావచ్చు. అన్నీ ఓకే అయితే, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌తో కలిసి 'వకీల్‌సాబ్‌' తీశారు.

నటుడు మంచు మనోజ్‌ గురువారం అగ్రకథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. 'భీమ్లానాయక్‌' చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ సినిమా సెట్‌లో పవన్‌ను కలిసిన మనోజ్‌ దాదాపు గంటసేపు ముచ్చటించారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలపైనే చర్చించుకుంటున్నట్లు సమాచారం.

  • It's always a pleasant yet powerful experience meeting our power star @PawanKalyan garu 🤗🔥
    Spoke heartfully. Thanks for the kind words & love u showered upon me anna🤗
    Love you much :) Jai Hind 💪🏾🔥 pic.twitter.com/YoRwxYPWiu

    — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.