ETV Bharat / sitara

మళ్లీ పోలీసు కథతోనే పవన్-హరీశ్ చిత్రం!

author img

By

Published : Aug 2, 2020, 11:16 AM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'గబ్బర్​సింగ్' ఘనవిజయం సాధించింది. ఇందులో పోలీసు పాత్రలో నటించి ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించారు పవన్. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పుడు వీరి కాంబోలో రాబోయే చిత్రం కూడా పోలీసు నేపథ్యంలోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మళ్లీ పోలీసు కథతోనే పవన్-హరీశ్ చిత్రం!
మళ్లీ పోలీసు కథతోనే పవన్-హరీశ్ చిత్రం!

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఇప్పటికే ఈ కాంబినేషన్​లో వచ్చిన 'గబ్బర్​సింగ్​' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం పవన్-హరీశ్ కాంబినేషన్​లో రాబోతున్న సినిమా కూడా పోలీసు నేపథ్యంలో ఉండనుందట. ఇందుకు సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్​ వరుస ఫ్లాప్​ల్లో ఉన్న సమయంలో వచ్చిన 'గబ్బర్​సింగ్' అఖండ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అలాగే ఇందులో పోలీసు క్యారెక్టర్​లో పవన్​ నటించిన తీరు అభిమానుల చేత ఈలలు కొట్టించింది. బాలీవుడ్​ 'దబంగ్'​ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ కథలో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేసి సక్సెస్ అయ్యారు హరీశ్. మరి ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.