ETV Bharat / sitara

Pawan kalyan Trivikram: త్రివిక్రమ్​కు పవన్​కల్యాణ్ స్పెషల్ గిఫ్ట్ - Pawan Kalyan latest news

తన స్నేహితుడు త్రివిక్రమ్​కు పవర్​స్టార్ పవన్ అద్భుత కానుకగా బహుమతిగా ఇచ్చారు. దానిని చూసి త్రివిక్రమ్ మురిసిపోయారు.

Pawan Kalyan Trivikram
త్రివిక్రమ్​ పవన్​కల్యాణ్
author img

By

Published : Sep 18, 2021, 1:28 PM IST

మహాకవి శ్రీశ్రీ ఓ శిఖరం లాంటి వారని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్నారు. శ్రీశ్రీ ముందు తనలాంటి వాళ్లందరు గులకరాళ్లంటూ వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని 'భీమ్లా నాయక్' సెట్​లో పవన్ త్రివిక్రమ్​కు అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరు శ్రీశ్రీ కవితలను, సాహిత్యాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు.

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్​ వీడియో

పవన్, త్రివిక్రమ్ సినిమా మిత్రులుగానే కాకుండా సాహిత్య మిత్రులు కూడా కావడం వల్ల తరుచూ పలువురు సాహితీవేత్తలు, వాళ్ల రచనలను గుర్తుచేసుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ క్రమంలో శ్రీశ్రీ 'మహాప్రస్థానం'పై ఆయన స్వరచనలో, ఛాయా చిత్రాలతో కూడిన పుస్తకాన్ని పవన్ త్రివిక్రమ్​కు అందజేశారు. ఈ సందర్భంగా ఒక కవి మరో కవి గురించి చెబుతుంటే వచ్చే సొబగు బాగుందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.