ETV Bharat / sitara

రీమేక్‌ చిత్రం కోసం 30 రోజులు కేటాయించిన పవన్‌! - పవన్ కల్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్​షీట్స్​ను నిర్మాణ సంస్థకు కేటాయించినట్లు సమాచారం.

Pawan Kalyan gave 30 days call sheets to Sitara entertainments
రీమేక్‌ చిత్రం కోసం 30 రోజులు కేటాయించిన పవన్‌!
author img

By

Published : Oct 28, 2020, 8:52 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్​'కు రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్​షీట్స్​ను కేటాయించి.. ఆ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేసే విధంగా చూడాలని చిత్రా నిర్మాణ సంస్థకు చెప్పారట.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమయ్యే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాదు చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు తెలుగులో ఉన్న కొంతమంది యువకథానాయకులను పరిశీలిస్తున్నారట. మరీ పవన్‌ సరసన నటించే ఆ అవకాశం ఏ హీరోకి దక్కుతుందో చూడాలి.

ఈ చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, నవీన్‌ నూలి ఎడిటర్‌ పనిచేస్తున్నారు. ఛాయాగ్రహకుడిగా ప్రసాద్ మూరెళ్ల వ్యవహరిస్తున్నారు. చిత్రం వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఈలోపు పవన్‌ పూర్తి చేయవలసిన చిత్రాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.