ETV Bharat / sitara

పవన్ కల్యాణ్ కొత్త​ సినిమా కోసం త్రివిక్రమ్ - pawan kalyan latest new

పవన్-త్రివిక్రమ్ కలిసి నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

pawan-kalyan-and-trivikram-to-team-up-for-ayyappanum-koshiyum-remake
పవన్ కల్యాణ్​ సినిమా కోసం త్రివిక్రమ్
author img

By

Published : Jan 15, 2021, 6:36 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. అలాంటి ఈ కాంబో.. మరో సినిమా కోసం కలిసి పనిచేయనుంది. అయితే ఈసారి పవన్ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడిగా కాకుండా స్క్రీన్ ప్లే, సంభాషణల రచయితగా పనిచేయబోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తున్న 'అయ్యప్పన్ కోషియమ్' రీమేక్​లో త్రివిక్రమ్ పెన్ పవర్ చూపించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించి త్రివిక్రమ్​కు ఆహ్వానం పలికింది. ఇందులో పవన్​తో పాటు రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, సాయిపల్లవిల పేర్లు కథానాయికలుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇది చదవండి: మాటే మంత్రం.. ఈ త్రివిక్రముడి తంత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.