ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో వస్తోన్న 'సైనా' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తొలుత ఓటీటీ వైపు చూసిన దర్శకనిర్మాతలు థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారని సమాచారం.

పరిణీతి చోప్రా టైటిల్ పాత్రలో అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చిత్రబృందం థియేటర్లలోనే విడుదలకు సన్నాహాలు చేస్తోంది. స్పోర్ట్స్ బయోపిక్ కావడం వల్ల థియేటర్లలో అయితేనే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని చిత్రబృందం భావిస్తోంది. మార్చి 28న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర నిర్మాత భూషణ్.
పరిణీతి నటించిన 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' ఇటీవలే నెట్ఫ్లిక్స్వో విడుదలైంది. ఆమె నటించిన మరో చిత్రం 'సందీప్ ఔర్ పింకీ పరార్' మార్చి 10న విడుదల కానుంది.