భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్ధాలకు ఉన్న ప్రత్యేకత వేరు. మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ చిత్రం 'పానిపట్'. ఇటీవలే ట్రైలర్‌ను పంచుకున్న చిత్రబృందం.. వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు సినిమాను తెస్తున్నట్లు ప్రకటించింది.
మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయిగా పద్మిని కొల్హాపురి, కృతిసనన్ పార్వతీబాయిగా, సంజయ్‌దత్ ఆహ్మద్ అబుద్‌అలీగా నటిస్తున్నారు.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా అంతకు మించేలా ఉంటుందని దర్శకుడు అశుతోష్ గోవారికర్ అన్నాడు. సునీత గోవారికర్, రోహిత్ షీలాత్కర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: 'పానిపట్' యుద్ధానికి సై అంటున్న సంజయ్, అర్జున్!