'బేవాచ్' మాజీ స్టార్ పమీలా ఆండ్రూసన్ 52 ఏళ్ల వయసులో ఇటీవలే ఐదో వివాహం చేసుకుంది. హాలీవుడ్ మొగల్‌గా పేరున్న ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌ను జనవరి 20న ఆమె పెళ్లాడింది. 74 ఏళ్ల పీటర్స్ కేవలం నిర్మాత మాత్రమే కాదు, నటుడు కూడా. వీరిద్దరూ మూడు దశాబ్దాల కిందట తొలిసారి డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయి మళ్లీ చాలా రోజుల తర్వాత కలిశారు. అయితే పెళ్లయిన తర్వాత వీరిద్దరి బంధం 12 రోజుల్లోనే పెటాకులైనట్లు సమాచారం.
![Pamela Anderson and Jon Peters have split up after just 12 days of marriage.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5934911_pamela.jpg)
"జాన్ నన్ను ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. సంతోషంగా ఉంది. మాకు ఒకరి జీవితం నుంచి మరొకరికి ఏం కావాలో తెలియట్లేదు. అది తెలిసే వరకు విడిగా ఉండాలని ఉంది. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాం"
-- పమీలా ఆండ్రూసన్
పమీలా గతంలో టామ్మీ లీ, కిడ్ రాక్, రిక్ సాలోమన్ అనే నలుగురిని పెళ్లి చేసుకుంది. ఇందులో మొదటి భర్త రాక్‌స్టార్ కాగా.. ఆఖరి భర్త సాకర్ ఆటగాడు.
-
https://t.co/MlgxRDnvIi pic.twitter.com/KqfCKM8N8d
— Pamela Anderson (@pamfoundation) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">https://t.co/MlgxRDnvIi pic.twitter.com/KqfCKM8N8d
— Pamela Anderson (@pamfoundation) February 1, 2020https://t.co/MlgxRDnvIi pic.twitter.com/KqfCKM8N8d
— Pamela Anderson (@pamfoundation) February 1, 2020