ETV Bharat / sitara

పదేళ్ల వయసులోనే అవార్డ్.. ఆస్కార్​ విశేషాలివే.. - ఆస్కార్

Oscars 2022: ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. యావత్​ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే ఈ పురస్కారాలను ఆదివారమే అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్​ గురించిన పలు ఆసక్తికర విశేషాలను చూసేయండి.

oscars 2022
oscars 2022 nominations
author img

By

Published : Mar 27, 2022, 6:52 AM IST

Updated : Mar 27, 2022, 1:34 PM IST

Oscars 2022: ఆస్కార్‌... ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు అందుకోవాలని చూసే పురస్కారం. ఈ అవార్డ్‌ ప్రదానోత్సవానికి ముహూర్తం దగ్గర పడింది. ఆదివారం లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్‌ పురస్కారాల వేడుక ప్రారంభం కానుంది. 23 విభాగాల్లో అకాడమీ అవార్డులు అందించనుంది. ఈ సందర్భంగా... ఆస్కార్‌ గురించి కొన్ని విశేషాలు...

oscars 2022
'వెస్ట్‌ సైడ్‌ స్టోరీ'
  • స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించిన 'వెస్ట్‌ సైడ్‌ స్టోరీ' ఈ ఏడాది ఆస్కార్‌ పోటీల్లో ఉత్తమ చిత్రంగా నామినేషన్‌ అందుకుంది. అయితే 1957లో ఇదే పేరుతో రూపొంది.. ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న సినిమాకు ఇది రీమేక్‌ కావడం గమనార్హం.
  • అత్యధికంగా ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న వ్యక్తి వాల్ట్‌ డిస్నీ. నిర్మాత, నటుడు, రచయిత అయిన ఈయన మొత్తం 64 నామినేషన్లు అందుకొని 25 గెలుచుకున్నారు.
  • ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న తొలి కలర్‌ సినిమా 'గాన్‌ విత్‌ ది విండ్‌'. 1940లో ఈ చిత్రానికి ఆస్కార్‌ పురస్కారం లభించింది.
  • టేటమ్‌ ఓ నీల్‌ అనే నటి అతిచిన్న వయస్సులోనే ఆస్కార్‌ అందుకున్న అమ్మాయిగా చరిత్రకు ఎక్కింది. 10 ఏళ్ల వయస్సులోనే 'పేపర్‌ మూన్‌' అనే చిత్రంలో సహాయ నటిగా ఆమెకు ఈ పురస్కారం దక్కింది.
    oscars 2022
    టేటమ్‌ ఓ నీల్‌
  • 81 ఏళ్ల వయస్సుల్లో అకాడమీ అవార్డు అందుకొని చరిత్రలో నిలిచారు జెస్సికా టాండీ. 'డ్రైవింగ్‌ మిస్‌ డైసీ' అనే చిత్రానికి గాను ఆమె పురస్కారం చేతపట్టుకున్నారు.
  • 1929 నుంచి 'అకాడమీ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌' పేరిట ఆస్కార్‌ పురస్కారాలు అందిస్తున్నారు. ఆస్కార్‌ ప్రతిమ బంగారు వర్ణంలో ఓ యోధుడు రెండు చేతులతో ఖడ్గం చేతపట్టి ఫిల్మ్‌ రీలు చుట్టపై ఠీవీగా నిలుచొని ఉన్నట్లు ఉంటుంది. ఇది 13.5 అంగుళాల పొడవు, 450 గ్రాముల బరువుంటుంది.
  • మొదటి సారి ఆస్కార్‌ను ఉత్తమ నటుడిగా ఎమిల్‌ జెన్నింగ్స్‌ అందుకున్నారు. 'ది లాస్ట్‌ కమాండ్‌' చిత్రానికి గాను ఇది దక్కింది.
  • కేథరిన్‌ హెప్‌బర్న్‌ అనే నటి 4 పురస్కారాలు అందుకొని ఎక్కువ అస్కార్లు తీసుకున్న మహిళగా నిలిచింది. క్లైంట్‌వుడ్‌ అనే నటుడు 4 అవార్డులతో అతి ఎక్కువ పురస్కారాలు అందుకున్న వాడిగా నిలిచాడు. అయితే ఈయన ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డులు అందుకోవడం విశేషం.
  • అకాడమీ అవార్డు అందుకున్న తొలి మహిళా దర్శకురాలిగా కేథరిన్‌ బిగ్‌లో నిలిచారు. ఈమె 2010లో 'ది హర్ట్‌ లాకర్‌' చిత్రానికి ఈ పురస్కారం సంపాదించారు. అప్పట్లో బాక్స్‌ఫీసు వద్ద అతి తక్కువ వసూళ్లు అందుకున్న ఆస్కార్‌ చిత్రంగా ఇది నిలిచింది.
    oscars 2022
    'ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌'
  • 'ఆల్‌ అబౌట్‌ ఈవ్‌' అనే బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం మొట్ట మొదట సారి 14 విభాగాల్లో నామినేషన్లు అందుకొని రికార్డ్‌ సృష్టించింది. ఆ తర్వాత జేమ్స్‌ కామెరూన్‌ తీసిన 'టైటానిక్‌' ఈ ఘనత సాధించింది. 94వ ఆస్కార్‌ వేడుకల్లో 'ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' 12 విభాగాల్లో అత్యధిక నామినేషన్లు అందుకొన్న చిత్రంగా నిలిచింది.

ఇదీ చూడండి: Oscars 2022: ఆస్కార్​ హోస్ట్​గా రెజీనా!

Last Updated : Mar 27, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.