లాస్ ఏంజిల్స్ వేదికగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అగంరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పారాసైట్(దక్షిణకొరియా) ఉత్తమ చిత్ర విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది. బోంగ్ జూన్ హో ఈ సినిమాను తెరకెక్కించాడు. సాంగ్ కాంగ్ హో , లీ సన్ కూన్, చాయ్ వూ షిక్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆస్కార్ అవార్డు బరిలో దిగిన ఈ సినిమా.. అనేక విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ కథా చిత్రంగా అవార్డు అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన 'బోంగ్ జూన్ హో' ఉత్తమ దర్శకుడిగానూ ఆస్కార్ దక్కించుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే విభాగంలోనూ బోంగ్ జూన్ హో, హేన్ జిన్ వోన్ జోడీ అవార్డు అందుకుంది. వీటితో పాటు పలు విభాగాల్లో నామినేషన్లలోనూ నిలిచింది.
పోటీలో నిలిచిన విభాగాలు...
- ప్రొడక్షన్ డిజైన్: లీ హ జన్, సెట్ డెకరేషన్: చో వోన్ వో
- ఫిల్మ్ ఎడిటింగ్: యాంగ్ జిన్మో
.
- " class="align-text-top noRightClick twitterSection" data="">