OO Antava Song Choreographer Vijay : కోరికలు, ఆశయాలు ఉంటే సరిపోదు.. వాటిని సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎదురయ్యే కష్టాల్ని అధిగమిస్తూ.. అనుభవాలుగా మలుచుకోగలగాలి. అనుకోకుండా వచ్చే అవకాశాల్ని ఒడుపుగా అందిపుచ్చుకునే నేర్పూ తెలిసుండాలి. అప్పుడే విజయం దరి చేరుతుంది. అందుకు నిదర్శనమే.. శ్రీకాకుళానికి చెందిన పొలాకి విజయ్. చిన్నప్పడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బతకుదెరువు కోసం భాగ్యనగరం వచ్చి మేస్త్రీగా కష్టం చిందించాడు. అయితేనేం.. ఇప్పుడు తనకో స్థాయి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి ప్రముఖ హీరోతో అదిరిపోయే స్టెప్పులేయించే కొరియోగ్రాఫర్ అనే ప్రత్యేక గుర్తింపూ దక్కింది. ఇప్పటికే 30కిపైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి.. సరికొత్త నృత్య రీతులతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విజయ్ సినీ ప్రయాణమేంటో.. అతని మాటల్లోనే...
ఇవీ చదవండి :