మల్టీస్టారర్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం(నవంబర్ 19న) కీలక అప్డేట్ రానుంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమై నేటితో ఏడాది కాగా... షూటింగ్ 70 శాతం పూర్తయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమాలోని కథానాయికలు, నటీనటలు వివరాలు వెల్లడించనున్నాడు జక్కన్న.
-
It's been a phenomenal year since the shoot of #RRR began! It was a productive year with 70% of shoot completed.✊🏻
— RRR Movie (@RRRMovie) November 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Also putting an end to speculations, we're glad to announce the lead actress for @tarak9999 & antagonists of the film tomorrow. Stay tuned... #RRR 🔥🌊
">It's been a phenomenal year since the shoot of #RRR began! It was a productive year with 70% of shoot completed.✊🏻
— RRR Movie (@RRRMovie) November 19, 2019
Also putting an end to speculations, we're glad to announce the lead actress for @tarak9999 & antagonists of the film tomorrow. Stay tuned... #RRR 🔥🌊It's been a phenomenal year since the shoot of #RRR began! It was a productive year with 70% of shoot completed.✊🏻
— RRR Movie (@RRRMovie) November 19, 2019
Also putting an end to speculations, we're glad to announce the lead actress for @tarak9999 & antagonists of the film tomorrow. Stay tuned... #RRR 🔥🌊
ఇప్పటికే రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా ఎంపికైంది. అల్లూరిగా చరణ్, కొమరం భీమ్‌గా తారక్ కనిపించనున్నాడు. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రలో సరిపోయే నటి కోసం దర్శక, నిర్మాతలు చూస్తున్నారు. నిత్యా మేనన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రభాస్‌కూ అవకాశం...!
ఈ సినిమాలో ప్రభాస్ కూడా సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన వాయిస్ ఓవర్‌తోనే పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులోని ఓ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఈ వదంతులు నిజమైతే.. జక్కన్న, ప్రభాస్ అభిమానులకు ఇది ట్రీట్ అని చెప్పొచ్చు. ఒకే సినిమాలో తారక్, చరణ్, ప్రభాస్ కనిపించడం కూడా విశేషం.
ఇదే సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించన్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని... వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.