ETV Bharat / sitara

అశ్లీల వీడియో కేసులో పూనమ్​ పాండే అరెస్ట్​ - పూనమ్​ పాండే వార్తలు

బహిరంగ ప్రదేశంలో అశ్లీల వీడియోలో నటించిందనే ఆరోపణలతో నటి పూనమ్​ పాండేపై గోవాలో ఇటీవలే కేసు నమోదైన కారణంగా గురువారం ఆమెను అరెస్టు చేశారు. చిత్రీకరణకు భద్రత కల్పించిన ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్​ వేటు వేశారు.

Obscene video shoot: Poonam Pandey detained, 2 cops suspended
అశ్లీల వీడియో కేసులో పూనమ్​ పాండే అరెస్టు
author img

By

Published : Nov 5, 2020, 10:57 PM IST

వివాదాస్పద నటి పూనమ్​ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్​ చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఓ మహిళా సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటే పూనమ్​పై మరో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో పూనమ్​ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

చిత్రీకరణ సమయంలో పూనమ్ పాండే, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్​ చేశారు. సిన్​క్వేరిమ్​లోని ఫైవ్​స్టార్​ హోటల్​లో బసచేస్తున్న పూనమ్​ పాండేను కలాంగూట్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని కెనకోనా పోలీసులను అప్పగించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆమెను ప్రశ్నించేందుకే అరెస్టు చేసినట్లు పోలీస్​ సూపరింటెండెంట్​ పంకజ్​ కుమార్​ సింగ్​ వెల్లడించారు.

కొద్దికాలం క్రితం గోవాలో ఉన్నప్పుడు పూనమ్.. తన భర్త సామ్ అహ్మద్​పై కెనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై దాడిచేసి లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత సామ్ బెయిల్ పై విడుదలయ్యాడు. పూనమ్, సామ్.. సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.