ETV Bharat / sitara

'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్: కోటి - నువ్వేకావాలి సినిమా న్యూస్​

ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్​లో తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'నువ్వే కావాలి'. ఈ చిత్రం మంగళవారం నాటికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు కోటి చెప్పిన విశేషాలు మీకోసం.

Nuvve Kavali movie has been completed 20 years since its release
'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్: కోటి
author img

By

Published : Oct 9, 2020, 7:25 PM IST

Updated : Oct 9, 2020, 8:00 PM IST

'నువ్వే కావాలి' ఓ ట్రెండ్ సెట్టర్: కోటి

'నువ్వులేక నేనులేను', 'నువ్వే.. నువ్వే', 'ఎలా చెప్పను', 'ప్రియమైన నీకు' వంటి ఎన్నో సూపర్​ డూపర్​ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు హీరో తరుణ్​. ఆయన ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్వే కావాలి'లో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 13తో 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.

హీరోగా సినిమా ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న తరుణ్​కు ఓ గొప్ప విజయాన్ని అందించింది 'నువ్వే కావాలి'. కాలేజీ చదువులు, స్నేహం విలువ, నైతికత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటీనటుల పాత్రాభినయం ఒకెత్తయితే... సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా అక్టోబర్ 13కు 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కోటి.. ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

"నువ్వే కావాలి' చిత్రాన్ని రామోజీరావు, స్రవంతి రవికిశోర్​.. ఈ రెండు సంస్థలు కలిసి తక్కువ బడ్జెట్​లో చిత్రీకరించి తెరకెక్కించారు. చిన్న కథను తీసుకుని దర్శకుడిగా విజయ్​ భాస్కర్​, రచయితగా త్రివిక్రమ్​ శ్రీనివాస్​ సహా మంచి బృందంతో నన్ను నేను నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం అందించారు. మిలీనియం (2000) సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సంగీతంలో కొత్త ట్రెండ్​ సృష్టించాలనే ఉద్దేశంతో కొత్తగా ప్రయత్నించా. దీంతో మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యువతకు ఇందులోని పాటలు బాగా రీచ్​​ అయ్యాయి."

- కోటి, సంగీత దర్శకులు

"ఈ సినిమాలో కొత్తగా ప్రయత్నించాలని విజయ్​ భాస్కర్​ను కొంత సమయం అడిగా. దీంతో చెన్నైలో సముద్రం ఒడ్డున కూర్చొని కొత్త కొత్త ట్యూన్స్ చేశా. అయితే అవేవి దర్శకులకు నచ్చలేదు. తర్వా కంపోజ్ చేసిన 'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..', 'అనగనగా ఆకాశం ఉంది..'తో పాటు అన్నీ ప్రేక్షకులను ఆకర్షించాయి. పాటలన్నీ ఒకెత్తయితే నేపథ్య సంగీతం చాల సంతృప్తిని ఇచ్చింది. సినిమాల్లో ఏదైనా ట్రెండ్​ సంగీతంతోనే సృష్టించగలం. కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు క్లైమ్యాక్స్​ సాంగ్​ ప్రత్యేకమైంది" అంటూ తన మనుసులోని మాటల్ని పంచుకున్నారు కోటి.

"ఈ సినిమా... నాకు మంచి పేరు తెచ్చింది. ఇందుకు ముఖ్యంగా ఉషాకిరణ్​ సంస్థ అధినేత రామోజీ రావుకి కృతజ్ఞతలు చెప్పాలి. రజతోత్సవం జరుగుతున్న సమయంలో ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇదంతా సాలూరి రాజేశ్వర రావు(కోటి తండ్రి) వల్ల వచ్చిన గౌరవం అనుకుంటున్నా" అంటూ చెప్పారు కోటి.

ఇదీ చూడండి: చిరంజీవి నట విశ్వ రూపానికి 28 ఏళ్లు

Last Updated : Oct 9, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.