ETV Bharat / sitara

వాళ్లేం తినాలో అతను చెబుతాడు! - celebrity nutritionist Vijay Mangam

'లైగర్‌' సినిమా కోసం విజయ్‌ దేవరకొండ బాక్సర్‌లా బాడీ పెంచేశాడు. అల్లుఅర్జున్‌ ఏ సినిమాకా సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. శరీరాన్ని ఎప్పటికప్పుడు ఇలా మార్చుకోవడానికి వ్యాయామానికి తోడు ఆహారంలోనూ చాలా మార్పులు చేసుకోవాలి కదా! ఆ మార్పులు ఎలా ఉండాలో చెప్పడం సహా.. అలాంటి ఆహారాన్ని వండి మరీ అందిస్తాడు విజయ్‌ మంగం. ఒక్క సెలబ్రిటీలు అనేకాదు కోరిన వాళ్లందరికీ ఆన్‌లైన్‌లో ఉచిత కన్సల్టెంట్‌గా ఉంటాడీ హైదరాబాదీ! ఆ సేవల వెనక పెద్ద లక్ష్యమే ఉందంటున్నాడు. ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

nutritionist Vijay Mangam special interview
వాళ్లేం తినాలో అతను చెబుతాడు!
author img

By

Published : Mar 21, 2021, 8:18 AM IST

Updated : Mar 21, 2021, 9:17 AM IST

ఏం తింటున్నామన్నది మాత్రమే కాదు.. ఎలా.. ఎప్పుడు.. ఎంత మోతాదులో తింటున్నామన్నది కూడా ఇప్పుడు చాలా ముఖ్యమవుతోంది. దాని ఆధారంగానే కీటోన్‌, పేలియో డైట్‌.. వంటి పేర్లెన్నో వినిపిస్తున్నాయి. నెట్‌లోనూ ఎంతో సమాచారం దొరుకుతోంది. ఇంత సమాచారం ఉన్నా చాలామంది ఆహార నియమాలని పాటించలేక పోతున్నారు. పాటించినా ఎక్కువ కాలం ఎందుకు కొనసాగించలేకపోతున్నారు! ఎందుకలా అని అడిగితే.. 'ఆహారం అన్నది తెచ్చిపెట్టుకున్న నియమంలా కాకుండా.. మన రోజువారి జీవనశైలిలో భాగంగా ఉండాలి. అలా ఉండాలంటే మనకిష్టమైనవే సరైన మోతాదులో తగిన సమయంలో తినడం తెలియాలి!' అంటాడు విజయ్‌ మంగం.

ఆయన సూచించే 'ఫిట్‌ ఫుడ్స్‌' వెనకున్న సూత్రం అదే. డైటింగ్‌ పేరుతో కడుపుమాడ్చుకోకుండా ఇష్టమైనవి తినాలని చెప్పే పోషకాహార నిపుణుల కోవలోకి వస్తాడు విజయ్‌. బరువు కన్నా చెడుకొవ్వు తగ్గించుకుంటే అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చంటాడు. శాస్త్రీయ పద్ధతులతో అలాంటి ఆహార నియమాల గురించి చెబుతూ.. వాటిని తానే స్వయంగా తయారుచేసి ఇస్తున్నందువల్లే విజయ్‌ స్థాపించిన 'రావియోలి ఫిట్‌ ఫుడ్స్' సంస్థ తెలుగు సినిమా ప్రముఖులకు చేరువైంది! నిజానికి, అతనిలా పోషకాహార నిపుణుడిగా మారడం వెనక పెద్ద కథే ఉంది.

nutritionist Vijay Mangam special interview
విజయ్​ మాంగం

ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ నుంచి..

"హైదరాబాద్‌లోని ఉషా హ్యాండ్‌ పంప్స్‌ తయారుచేసే అమర్‌ మౌల్డింగ్‌ వర్క్స్‌ సంస్థ మా కుటుంబానిదే. నాన్న యాభైయేళ్ల కిందట దాన్ని స్థాపించారు. ఆ పరిశ్రమకు నేను ఉపయోగపడాలనే నాచేత మెటలర్జీలో బీటెక్‌ చేయించారు. తర్వాత లండన్‌లో ఎమ్మెస్‌ చేశాను. అక్కడే రోల్స్‌రాయిస్‌ సంస్థకు చెందిన విమాన ఇంజిన్‌ల విభాగంలో చేరాను. మూడేళ్లయ్యాక, నా మెటలర్జీ నైపుణ్యం మా పరిశ్రమకే ఉపయోగపడాలని నాన్న పట్టుబట్టడం వల్ల హైదరాబాద్‌ వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను. ఆరేళ్లపాటు ఎంతో కష్టపడి సంస్థను కొత్త బాట పట్టించాను. కానీ, పోనుపోను నేనో 'కంఫర్ట్‌జోన్‌'లో కూరుకుపోతున్నట్టు అనిపించింది. కొత్తదనం కోసం తపన నశించింది. మా పరిశ్రమలో ఉంటే అలా స్తబ్దంగా ఉండిపోతానని భయపడి బయటకు వచ్చి ఓ విదేశీ విద్యా కన్సల్టెన్సీ సంస్థలో ఉద్యోగిగా చేరాను. దాని యజమాని రవీందర్‌.. నాలో పోషకాహార నిపుణుడిని గుర్తించిన తొలి వ్యక్తి!"

"అతనూ నేనూ కలిసి భోజనానికి వెళ్లినప్పుడల్లా భోజనం అసలు ఎలా తయారు చేయాలో.. ఏ సమయంలో చేయాలో లెక్చరిస్తుండేవాణ్ణి. నిజానికి, నేను లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే పౌష్టికాహారంపైన ఎన్నో ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. ఆ అనుభవంతో నేను అతనికి సూచనలు ఇస్తుంటే రవీందర్‌ నాకు ఈ పౌష్టికాహార రంగమే సరైందని చెప్పాడు. అంతేకాదు, నేను కెనడాలోని ప్రెసిషన్‌ న్యూట్రిషన్‌ సంస్థలో ఏడాది డిప్లమో కోర్సు చేయడానికీ సాయపడ్డాడు. అలా పూర్తిస్థాయి పోషకాహార నిపుణుడినైపోయిన నేను హైదరాబాద్‌ వచ్చి ఇక్కడో రెస్టారెంట్‌లో 'ఫిట్‌నెస్'‌ ఆహారం చేసివ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను. రేపోమాపో మా ఆహారం మార్కెట్‌లోకి వస్తుందని అనుకుంటుండగా.. ఆ రెస్టారెంట్‌ మూతపడింది! ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోనే హోటల్​‌ భాగస్వాముల్లో ఒకరు నన్ను నటి లక్ష్మీ మంచుకు పరిచయం చేశారు. మా ఫిట్‌నెస్‌ ఫుడ్‌కు ఆమె తొలి కస్టమర్‌ అయ్యారు" అని చెబుతాడు విజయ్‌.

సెలబ్రిటీలతో విజయ్​ మాంగం

సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా..

లక్ష్మీ మంచు ద్వారా మంచు విష్ణు, అల్లు అర్జున్‌ వంటివాళ్లు తమకు తగ్గ ఆహారం కోసం విజయ్‌ను సంప్రదించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తనను పోషకాహార నిపుణుడిగా గుర్తించిన రవీందర్‌ పేరు కలిసొచ్చేలా 'రావియాలి ఫిట్‌ ఫుడ్స్‌' సంస్థను ఏర్పాటుచేశాడు విజయ్‌. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నవదీప్‌ తదితరులతో పాటూ రాజకీయ నాయకులూ ఈ సేవల్ని అందుకుంటున్నారు.

వీఐపీల నుంచి కొంత రుసుము తీసుకునే విజయ్‌ సామాన్యులకు ఆన్‌లైన్‌లో ప్రతి బుధవారం ఉచితంగానే కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అందులో ఫిట్‌నెస్‌ ఆహారం ఎలా తయారుచేసుకోవాలో కూడా నేర్పిస్తాడు. "జ్ఞానం పెంచుకున్నకొద్దీ పెరుగుతుందంటారు. అందుకే నా పోషకాహార పరిజ్ఞానాన్ని కనీసం పదిలక్షలమందితోనైనా పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా!" అంటున్నాడు విజయ్‌.

- కె.రమ్యా నవన్‌,

ఈటీవీ, హైదరాబాద్‌

ఇదీ చూడండి: కంగన పుట్టినరోజున 'తలైవి' ట్రైలర్​

Last Updated : Mar 21, 2021, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.