స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం అల 'వైకుంఠపురములో'. ఈరోజు(ఆదివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను తొలిరోజే చూసిన జూనియర్.ఎన్టీఆర్... ట్విట్టర్ వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. ఓ గొప్ప చిత్రం చూసిన అనుభూతి కలిగిందన్నాడు. అయితే ట్వీట్ చివర్లో జూ. ఎన్టీఆర్... కంగ్రాట్స్ బావ అంటూ అనడం.. అటు బన్నీ, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పటికే ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అయింది.
"అల్లు అర్జున్ అద్భుత ప్రదర్శనకు తోడు దర్శకుడు త్రివిక్రమ్ సినిమా బాగా తీశారు. 'అల వైకుంఠపురములో' చిత్రం గొప్ప అనుభూతినిచ్చింది. సహాయ పాత్రలో మురళీశర్మ నటన మెచ్చుకోదగింది. తమన్ సంగీతం చాలా ప్లస్ అయింది. కంగ్రాట్స్ బావ, స్వామి. శుభాకాంక్షలు" -ట్విట్టర్లో తారక్
బన్నీ స్పందన...
యంగ్ టైగర్ ట్వీట్‌కు వెంటనే స్పందించాడు బన్నీ. ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ 'థ్యాంక్యూ సో మచ్ బావ' అంటూ ట్వీట్ చేశాడు.
-
Bavaaaaaaaa ! Thank you very mucccchhhh . It’s was soo good talking to you ... seee you soon ! https://t.co/qgp3b67jiz
— Allu Arjun (@alluarjun) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bavaaaaaaaa ! Thank you very mucccchhhh . It’s was soo good talking to you ... seee you soon ! https://t.co/qgp3b67jiz
— Allu Arjun (@alluarjun) January 12, 2020Bavaaaaaaaa ! Thank you very mucccchhhh . It’s was soo good talking to you ... seee you soon ! https://t.co/qgp3b67jiz
— Allu Arjun (@alluarjun) January 12, 2020
ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. టబు, సుశాంత్, నవదీప్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
'బాహుబలి' రికార్డును కొట్టేసిన 'అల వైకుంఠపురములో'