ETV Bharat / sitara

రామ్​చరణ్​కు క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్​! - సినిమా న్యూస్​

రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా సర్​ప్రైజ్​ గిఫ్ట్​ ఇస్తానని ఎన్టీఆర్​ ట్విట్టర్​లో ప్రకటించాడు. అనుకున్న సమయానికి బహుమతి ఇవ్వటంలో విఫలమయ్యాడు యంగ్​టైగర్​​. దీంతో చెర్రీకి సారీ చెప్పాడు.

NTR says SORRY to RamCharan For the delay of his birthday surprise
రామ్​చరణ్​కు సారీ చెప్పిన ఎన్టీఆర్​!
author img

By

Published : Mar 27, 2020, 10:53 AM IST

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్​ప్రైజ్​ వీడియోను విడుదల చేస్తానని నటుడు ఎన్టీఆర్​ ట్విట్టర్​లో తెలిపాడు. అనుకున్న సమయానికి విడుదల ఆలస్యమైంది. ఆ జాప్యానికి కారణం దర్శకుడు రాజమౌళి అని అంటున్నాడు ఎన్టీఆర్​.

"సారీ.. బ్రదర్ రామ్​చరణ్​. నీకు ఇవ్వాలనుకున్న సర్​ప్రైజ్​ను దర్శకుడి అభిప్రాయం కోసం రాత్రి జక్కన్న(రాజమౌళి)కు పంపించాను. రాజమౌళి అంటే ఎంత సమయం పడుతుందో తెలుసుకదా..! మరికొంత సమయం పడుతుంది."

- ఎన్టీఆర్​ ట్విట్టర్​ సారాంశం

  • Sorry brother @AlwaysRamCharan . I sent your gift to Jakkanna @ssrajamouli last night for his opinion. Being Rajamouli, you know how it goes. 🤦🏻‍♂️
    Small delay..

    — Jr NTR (@tarak9999) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సర్​ప్రైజ్​ కోసం తానూ ఎదురుచూస్తున్నట్టు ట్విట్టర్​లో వెల్లడించాడు మెగాస్టార్​ చిరంజీవి. ఈ పోస్ట్​ను ట్యాగ్​ చేస్తూ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. ఈ వీడియో విడుదల కొంత సమయం పడుతుందని ఆ పోస్ట్​ ద్వారా దర్శకధీరుడు తెలిపాడు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'(రౌద్రం రణం రుధిరం). ఉగాది సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఆసక్తి పెంచింది చిత్రబృందం.

ఇదీ చూడండి.. చిరుత నుంచి అల్లూరి సీతారామరాజు వరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.