ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​​పై తారక్​ భావోద్వేగం.. మాటలు రావడం లేదంటూ.. - అజయ్​ దేవ్​గణ్

NTR RRR: నటుడిగా తనను రాజమౌళి మరింత రాటుదేల్చాడని చెప్పారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. తనలోని అత్యుత్తమ నటనను బయటపెట్టేందుకు జక్కన్న స్ఫూర్తినింపాడని అన్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం మొత్తానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. చరణ్​ లేకపోతే 'ఆర్ఆర్​ఆర్'​తో పాటు 'భీమ్'​ కూడా అసంపూర్ణమే అని పేర్కొన్నారు.

NTR RRR
rajamouli
author img

By

Published : Mar 29, 2022, 12:21 PM IST

Updated : Mar 29, 2022, 12:34 PM IST

NTR RRR: ఎన్టీఆర్​-రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ బ్లాక్​బస్టర్​ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్​ వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే తనకు అపూర్వ విజయాన్ని అందించిన రాజమౌళి, చరణ్​ సహా 'ఆర్​ఆర్​ఆర్'​ బృందానికి థ్యాంక్స్​ చెబుతూ లేఖ రాశారు తారక్.

NTR RRR
తారక్ లేఖ

"అత్యుత్తమ ప్రదర్శన చేసేలా నాలో స్ఫూర్తి నింపిన జక్కనకు ధన్యవాదాలు. నిజంగానే నీటిలా వెర్సటైల్​గా మారేలా చేశావు. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించావు. ఇక నా బ్రదర్​ చరణ్​ లేకపోతే 'ఆర్​ఆర్​ఆర్'​ లేదు. అల్లూరి సీతారామరాజు పాత్రకు నీవు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. 'ఆర్​ఆర్​ఆర్' మాత్రమే కాదు భీమ్​ కూడా నువ్వు లేకుంటే అసంపూర్ణమే. ఈ నీటికి నిప్పులా తోడైనందుకు ధన్యవాదాలు"

-ఎన్టీఆర్​, నటుడు

NTR RRR
జక్కన్నతో తారక్

జక్కన్న, చెర్రీతో పాటు సినిమాలో నటించిన అజయ్​ దేవ్​గణ్​, ఆలియా భట్, ఒలివియా మోరిస్​లకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, సెంథిల్, సాబూ సిరిల్​, శ్రీనివాస మోహన్, ఎడిటర్ శ్రీకర్​ ప్రసాద్, కార్తికేయ, కాలభైరవ, ప్రేమ్​ రక్షిత్​లకు ధన్యవాదాలు చెప్పారు. ఇండస్ట్రీకి, మీడియా, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.500కోట్ల క్లబ్​లో..

Last Updated : Mar 29, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.