యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాపారవేత్తగా నటించబోతున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోయే 'ఎన్టీఆర్ 30' సినిమాలోనే తారక్ ఈ వేషం వేయబోతున్నారని టాక్. తారక్ ఇప్పటివరకు నటించని పాత్రలో చూపించే ప్రయత్నంలో ఉన్నారట త్రివిక్రమ్.
స్టైలిష్ బిజినెస్‌మెన్ లుక్‌లో తారక్ దర్శనమివ్వబోతున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. మరి ఈ చిత్రంలో తారక్ ఏ వ్యాపారం చేస్తాడో? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.