కొన్నాళ్లుగా అగ్ర కథానాయకుల చిత్రాలు పాన్ ఇండియా స్థాయి లక్ష్యంగానే రూపొందుతున్నాయి. చేస్తున్న సినిమా ఒక భాషకంటూ పరిమితం కాకుండా... అన్ని భాషలకు చేరువ కావాలనే లక్ష్యంతోనే వాటిని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. ఓటీటీ వేదికలు... సామాజిక అనుసంధాన వేదికల్లో డబ్బింగ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణనే అందుకు ప్రధాన కారణం. పాన్ ఇండియా స్థాయి నిర్మాణానికి తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోంది. పలు భాషల్లో గుర్తింపున్న కథానాయికల్ని, ఇతర ప్రధాన తారాగణాన్ని ఎంపిక చేయడానికే ఆసక్తి చూపుతున్నాయి చిత్రబృందాలు.
ఎన్టీఆర్ 30వ చిత్రం కోసం బాలీవుడ్ నుంచే కథానాయిక రానుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్', కొరటాల 'ఆచార్య' చిత్రాలు పూర్తయిన వెంటనే.. ఈ ఇద్దరూ కలిసి కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. అయితే ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నట్టు సమాచారం. కథానాయిక ఎంపికపై కొన్నాళ్లుగా కసరత్తులు సాగుతున్నాయి. ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామలు కియారా అడ్వాణీ కానీ, అలియాభట్‌ను కానీ ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: