కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎస్.ఆర్. కల్యాణమండపం'. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా కారణంగా సినిమా థియేటర్లలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన చిత్రబృందం.. తమ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
విభిన్న కథా చిత్రాలతో సత్తాచాటుతున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే 'జాంబీరెడ్డి'తో హిట్ అందుకున్న ఆయన తాజాగా మరో కొత్త మూవీ ప్రకటించారు. దీనిని మరో కొత్త జోనర్లో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ పూర్తి వివరాలను శనివారం (మే 29) వెల్లడిస్తామని తెలిపారు.
రామ్ అగ్నివేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఇక్షు'. రుషిక దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు చెప్పిన ప్రఖ్యాత డైలాగ్ 'పాంచాలీ పంచ బధ్రుకా' (దాన వీర శూర కర్ణ)ను ఈ చిత్రంలో కథానాయకుడు వినిపించే సన్నివేశం ఒకటుంది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సంబంధిత టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పరువునష్టం దావాపై సల్మాన్ టీమ్ క్లారిటీ