ETV Bharat / sitara

ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా: తారక్

author img

By

Published : Mar 13, 2021, 2:26 PM IST

కొన్నేళ్ల తర్వాత బుల్లితెరపై మరోసారి సందడి చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన వ్యాఖ్యాతగా ఓ ప్రముఖ ఛానెల్​లో ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్ ప్రోమో నేడు విడుదల చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన తారక్ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

NTR
తారక్

అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని నందమూరి తారక రామారావు అన్నారు. వెండితెర వేదికగా అభిమానుల్ని అలరించిన ఆయన కొన్నేళ్ల విరామం తర్వాత మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారంకానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్‌ ఏమన్నారంటే..

ఈ షో ఒప్పుకోవడానికి ప్రధాన కారణమేమిటి?

తారక్‌: ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. వివిధ జీవన స్థితిగతుల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే దీని లక్ష్యం. గతంలో చిరంజీవి, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశారు. కాబట్టి నాకు ఇది ఓ ఛాలెంజ్‌. నా వంతు మార్క్‌ క్రియేట్‌ చేయడానికి కృషి చేస్తా.

NTR about fans and his Political entry
ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో వేడుక

దాదాపు మూడేళ్లుగా మీరు సినిమాల్లో కనిపించలేదు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా లేరు. అభిమానులు మీకు పంపించే సందేశాలు చూస్తారా?

తారక్‌: మొదటి నుంచి సోషల్‌మీడియాలో నేను అంత యాక్టివ్‌గా ఉండేవాడిని కాదు. ఫ్యాన్స్ నా నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం అనుకుంటున్నారు? అనే విషయాన్ని ప్రతిసారీ నా టీమ్‌ నాకు సమాచారాన్ని ఇస్తుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' అంతలా డిమాండ్‌ చేసింది.. అందుకే మూడేళ్ల నుంచి కనిపించడం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్విస్తున్నా. మన హీరోలకు దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చే చిత్రమది. అలాగే, నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఖాళీ సమయాన్ని వాళ్లతో సరదాగా గడుపుతున్నా. అంతకు మించి నేను ఏం కోరుకుంటాను.

రాజకీయ ప్రవేశం ఎప్పుడు?

తారక్‌: ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం(నవ్వులు).

ఈ షో నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌.. రామారావుగా ప్రమోట్‌ అయ్యాడా?

తారక్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌, తారక్‌, రామారావు ఇలా ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా. ఇలాగే పిలవండి అని నేను ఎప్పుడూ పట్టుబట్టి అడగలేదు.

  • నేను అభిమానులకు చేసిన దానికంటే అభిమానులు నాకు చేసింది చాలా ఎక్కువ. మీరు ఇలా చేస్తే బాగుంటుందని నేను ఏరోజూ వాళ్లతో చెప్పలేదు. వాళ్లే అనుకుని ఎన్నో మహోన్నతమైన సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. ఏ హీరో అభిమాని అనేది ముఖ్యం కాదు.. మనుషులుగా సేవా చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అభిమానుల రుణం నేను ఏ రోజుకీ తీర్చుకోలేను. రుణం తీరని బంధం అది. అభిమానులు కాలర్‌ ఎగరేసుకుని తిరిగే స్థాయిలో నేను తప్పకుండా పనిచేస్తా. మీ నమ్మకాన్ని ఒమ్ముచేయను.
  • షో ఫార్మాట్‌ ఏం మారలేదు. ఈ షో నుంచి డబ్బులు ఎంత తీసుకువెళ్లామన్నది ముఖ్యం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్లు తప్పకుండా ఆత్మవిశ్వాసంతో వెళ్లేలా చేయడమే నా బాధ్యత.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.