'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న జూ.ఎన్టీఆర్.. ట్విట్టర్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఐదు మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను అధిగమించారు. ఈ ఘనత సాధించిన అతికొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరిగా నిలిచారు.
'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు తారక్. ఇతడితో పాటు రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. దాదాపు రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇవీ చదవండి: