ETV Bharat / sitara

వెబ్​ సిరీస్ వివాదంలో ఆ నిర్మాతపై పోలీస్ కేసు - ex-army personnel complaint against xxx 2

ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్‌పై గుడ్​​గావ్​లో కేసు నమోదైంది. 'ఎక్స్​ఎక్స్​ఎక్స్​ అన్​సెన్సార్డ్​ 2' అనే వెబ్​సిరీస్​లో ఆర్మీ దుస్తులపై అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మాజీ సైన్యాధికారి.

Ekta Kapoor's XXX
ఏక్తాకపూర్​పై మరో కేసు..
author img

By

Published : Jun 5, 2020, 2:40 PM IST

Updated : Jun 5, 2020, 3:18 PM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్​పై గుడ్​​గావ్​ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ మాజీ సైన్యాధికారి ఈ ఫిర్యాదు చేశారు. ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు.

ఏక్తా కపూర్‌ రూపొందించిన 'ఎక్స్​ఎక్స్​ఎక్స్​ అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌-2' వెబ్‌ సీరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని 'ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్‌' ఎపిసోడ్‌లో ఆర్మీ దుస్తులను ధరించిన ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలున్నాయి.ఫేస్​బుక్​ పేజీలో వెబ్ సిరీస్​కు చెందిన ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ఇందులో ఆర్మీ వ్యక్తికి, ఓ మహిళకు సంబంధం ఉన్నట్లు చూపించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​, య్యూట్యూబ్​ స్టార్​ హిందుస్తానీ బౌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

44 ఏళ్ల ఏక్తాకపూర్ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దర్శకురాలు. 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలీ ఫిలింస్‌కు ఆమె క్రియేటివ్ హెడ్‌, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సినిమా రంగంలో ఏక్తా చేస్తున్న సేవలకు పద్మశ్రీ లభించింది.

Last Updated : Jun 5, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.