ETV Bharat / sitara

No Time To Die: 'జేమ్స్​ బాండ్​' రిలీజ్​ డేట్​ ఫిక్స్​ - నో టైమ్​ టుడై రిలీజ్​ డేట్​

జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ నుంచి మరో చిత్రం సందడి చేసేందుకు సిద్ధమైంది. 'సిరీస్​లో 25వ సినిమాగా తెరకెక్కిన 'నో టైమ్‌ టు డై'(No Time To Die release date) సెప్టెంబర్​ 30న భారత్​లో, అక్టోబర్​ 8న అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదలైన ఫైనల్‌ ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

No Time To Die
జేమ్స్‌ బాండ్‌
author img

By

Published : Sep 1, 2021, 4:32 PM IST

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌(James bond) చిత్రాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా 'నో టైమ్‌ టు డై'(No Time To Die release date) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేనియల్‌ క్రేగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. విలన్‌ సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

భారత్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 30న ఇండియాలో బాండ్‌ థియేటర్‌లలో సందడి చేయనున్నాడు. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫైనల్‌ ట్రైలర్‌ బాండ్‌ 25వ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అలరించే యాక్షన్‌ సన్నివేశాలతో సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హీరోనే కానీ బాండ్​ కారును నడపనివ్వలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.