ETV Bharat / sitara

జేమ్స్​బాండ్​నే భయపెట్టిన కరోనా వైరస్ - 'No Time To Die' China premiere, tour scrapped amid coronavirus outbreak

'జేమ్స్​ బాండ్'​ ​చిత్రానికి కరోనా(కొవిడ్​ 19) షాక్​ తగిలింది. అతిపెద్ద మార్కెట్​ ఉన్న చైనాలో ఈ సిరీస్ తర్వాతి చిత్రం 'నో టైమ్​ టు డై' విడుదల వాయిదా పడింది. డేనియల్​ క్రెగ్​ ఈ హీరో పాత్రలో చివరిసారి కనువిందు చేయనున్నాడు.

china
చైనాలో 'నో టైమ్​ టు డై' చిత్రం వాయిదా
author img

By

Published : Feb 17, 2020, 12:53 PM IST

Updated : Mar 1, 2020, 2:45 PM IST

హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెగ్‌ నటించిన 'నో టైమ్​ టు డై' చిత్రానికి కరోనా వైరస్​తో చిక్కులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బాక్సాఫీస్​ మార్కెట్ అయిన​ చైనాలో... వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ఆ దేశంలో విడుదలను చిత్రబృందం వాయిదా వేసింది. అంతేకాకుండా ఏప్రిల్​ నెలలో సినిమా ప్రచారాలనూ మానుకుంది.

చివరిసారి బాండ్​ పాత్రలో...

2005 నుంచి తెరకెక్కిన బాండ్​ సిరీస్​ చిత్రాల్లో క్రెగ్​ తనదైన శైలిలో నటించి మెప్పించాడు.​ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమాగా 'నో టైమ్‌ టు డై' తెరకెక్కింది. ఈ చిత్రంలో చివరిసారిగా బాండ్​ పాత్రలో అలరించనున్నాడు క్రెగ్. ఈ చిత్రానికి కెరీ జోజి దర్శకత్వం వహించాడు.

హాలీవుడ్​ ప్రముక నటీనటులు బెన్​ విక్షా, నామి హ్యారిస్​, రాల్ఫ్​ ఫిన్నెస్​, లి సైడక్స్​, జెఫ్రి వ్రైట్​, రమి మాలెక్​, లషనా లించ్​ తదితరులు ఇందులో నటించారు. ఏప్రిల్​ 10న అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండిః "సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..!

Last Updated : Mar 1, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.