డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన బాలీవుడ్ నటుడు షారుక్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు (Shahrukh Khan Son Drug Case) బాంబే హైకోర్టులో మరోసారి ఉపశమనం లభించింది. డ్రగ్స్ (Aryan Drug Case) సంబంధిత నేరాల కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్‌లో ఎలాంటి అభ్యంతరకర అంశాలు లేవని పేర్కొంది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేందుకు ముగ్గురు నిందితులు ఓ నిర్ణయానికి వచ్చారని కోర్టు భావించేందుకు ఎలాంటి సానుకూల ఆధారం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులు ముగ్గురు ఒకే విహారనౌకలో ప్రయాణించటం ఒక్కటే వారిపై ఆరోపణలకు పునాది కాలేదంటూ బెయిల్ మంజూరును న్యాయస్థానం (Aryan Drug Case Status) సమర్థించుకుంది. దర్యాప్తు అధికారి నమోదు చేసిన నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలపై నార్కోటిక్స్ విభాగం ఆధారపడకూడదని, ఎందుకంటే అవి చెల్లుబాటు కావని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి: 'మాజీ సీఎం భార్యతో డ్రగ్స్ వ్యాపారి ఫొటోలు'