ETV Bharat / sitara

'నో' చెప్పడం నేర్చుకోండి లేకపోతే అంతే : పూరీ - పూరీ జగన్నాథ్​ మ్యూజింగ్స్​

పూరీ మ్యూజింగ్స్​లో భాగంగా మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్​ 'నో' అనే అంశం గురించి చర్చించారు. ప్రతిమనిషి జీవితంలో 'నో' చెప్పడం నేర్చుకోవాలని సూచించారు.

puri
పూరీ
author img

By

Published : Sep 27, 2020, 10:43 PM IST

ప్రతి మనిషి 'నో' చెప్పడం నేర్చుకోవాలని, లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో వివిధ అంశాలు,పదాల గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'నో' (కాదని చెప్పండి) అనే అంశం గురించి ముచ్చటించారు.

"నో చెప్పడం ఎలా.. మనందరం నేర్చుకోవాల్సిన విషయం. ఇది జీవితంలో చాలా ముఖ్యం. ఎదుటి వ్యక్తి అడిగిన ప్రతిదానికీ ఎస్‌ చెబితే నువ్వు విజయం సాధించనట్లే. ముందు నో చెప్పండి, లేదా సమయం కావాలని అడగండి. అన్నింటికీ అక్కడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించిన తర్వాత కూడా.. నచ్చకపోతే నో చెప్పండి. అయితే అప్పుడు చెప్పే నో.. ఎస్‌లా ఉండాలి. ఎదుటి వ్యక్తిని బాధించకుండా నో చెప్పడం సాధన చేయండి. జీవితంలో నేను అన్నింటికీ ఎస్‌ చెప్పడం వల్ల చాలా కష్టాలు పడ్డా. ఎవరైనా మన ముందు ఒక ప్రపోజల్‌ పెడితే.. అది వాడి స్వార్థం కోసమే. మనం పెడితే, మన స్వార్థం కోసమే.. ఇందులో నో చెప్పిన వాడే సక్సెస్‌ అయినట్లు. నో మీకు శక్తిని ఇస్తుంది, అలా చెప్పిన ప్రతిసారీ సంతోషంగా ఫీల్‌ అవుతారు. చాలా సార్లు ఎందుకు ఒప్పుకున్నానా? అని బాధపడుతుంటారు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ప్రపోజల్‌ మీకు కూడా లాభం చేకూరుస్తుంది అనిపించినా.. ముందు నో చెప్పండి. సమయం తీసుకుని.. ఆ తర్వాత ఎస్‌ చెప్పండి. ప్రతిదానికీ ఎస్‌ చెబితే.. తక్కువైపోతారు. ‘వాడ్ని డీల్‌ చేయడం కష్టం కాదులే.. అంటారు. నో చెప్పగలిగేవాడే పవర్‌ఫుల్‌. మీరు నో చెప్పగానే అవతలివాడు దాన్ని ఎస్‌లా ఫీల్‌ అయ్యి.. డీల్‌ అయిపోయిందని సంతోషంగా వెళ్లిపోతే.. మీ అంతటి దేశముదురు మరొకరు లేరు. మీ పేరేంటో చెప్పండి. నేనొచ్చి మీ దగ్గర పని చేస్తా.." అని పూరీ ముగించారు.

ప్రస్తుతం పూరీ.. హీరో విజయ్​ దేవరకొండతో ప్యాన్​ ఇండియా సినిమాగా ఫైటర్​ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్​ హీరోయిన్​ అనన్య పాండే నటిస్తోంది.

ఇదీ చూడండి అల్లు అర్జున్ స్ఫూర్తితో బాలీవుడ్​ బ్యూటీ డ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.