Dhanush and aishwarya: కోలీవుడ్ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య విడాకుల నిర్ణయం అందరినీ షాక్కు గురిచేసింది. ఇటీవలే ఈ జంట.. తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు దీనిపై స్పందించారు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా. ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకోలేదని వాళ్లు మళ్లీ కలుస్తారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ధనుష్- ఐశ్వర్య జంట చెన్నైలో లేదని హైదరాబాద్లో ఉందని కస్తూరి వెల్లడించారు. విడాకుల విషయమై వారికి ఫోన్ చేసి మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ధనుష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇవి రెండు ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.