దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పెద్ద చిత్రాలు విడుదలలు సహా చిత్రీకరణలూ ఆగిపోయాయి. అయితే ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'సలార్' షూటింగ్లో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలోగా చిత్రీకరణను పూర్తి చేసి.. ఇదివరకు ప్రకటించిన తేదీ(ఏప్రిల్ 14న)నే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుందట.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా ప్రతినాయకుడు ఎవరనేది వెల్లడించలేదు. రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
ఇదీ చూడండి.. 'మిస్ యూ నాన్న!'.. యాంకర్ ప్రదీప్ భావోద్వేగపు పోస్ట్