ETV Bharat / sitara

'ఆ విషయంలోనే ఎక్కువగా బాధపడుతుంటా'

నేచురల్ స్టార్ నాని, సుధీర్​ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వి'. ఇందులో నివేదా థామస్​ హీరోయిన్​. ఓటీటీ వేదికగా సెప్టెంబరు 5న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే థియేటర్లపై ఓటీటీ ప్రభావంతో పాటు, 'వి' చిత్రీకరణలో తనకు ఎదురైన అనుభవాలపై నివేదా చెప్పిన విశేషాలేంటో తెలుసుకుందాం.

nivedaa thomus about v movie special interview
నివేదా థామస్​
author img

By

Published : Aug 30, 2020, 6:44 AM IST

'ఓటీటీలకు భవిష్యత్తు ఉంది. ఇవి సినిమాలు తీసేవాళ్లకు మంచి వేదికలుగా మారుతాయి. కానీ థియేటర్లకు ప్రత్యామ్నాయమవుతాయని నేను అనుకోవడం లేదు' అని అంటోంది టాలీవుడ్​ ప్రముఖ హీరోయిన్​ నివేదా థామస్‌. ప్రస్తుతం ఆమె 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆన్​లైన్​ వేదికగా మీడియాతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ చెప్పిన విశేషాలు ఇవి.

ఆశ్చర్యపోయేదాన్ని...

ఇందులో నా పాత్ర పేరు అపూర్వ. ఈ విషయాన్ని మేం చెప్పకముందు నుంచే చాలా మంది నన్ను అపూర్వ అని పిలిచేవారు. అది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. వీళ్లకు నా పాత్ర పేరు ఎలా తెలిసిందని అనుకునేదాన్ని. ట్రైలర్‌లో సుధీర్‌కి అపూర్వ అని ఒక కాల్‌ వస్తుంది. దాన్ని వాళ్లు బాగా గమనించారు. అప్పుడే ప్రేక్షకులు ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారని తెలిసొచ్చింది. అపూర్వ ఒక క్రైం నవల రాయాలని అనుకుంటుంది. దీనికోసం ఆమె ఎంత దూరమైనా వెళ్లాలని అనుకుంటుంది. ఇది నాకిష్టమైన పాత్ర.

అదే 'వి'...

'వి' అంటే ఏంటనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. 'వి' అంటే విజయం అని అనుకోవచ్చు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

అలాంటి పాత్రలు చేస్తా

ఆరు నెలల్లో ఎన్నో కథలు విన్నా. అవన్నీ తెలుగు కథలే. నేను విలన్‌గా చేయడానికి సిద్ధంగానే ఉన్నా. నెగెటివ్‌ పాత్ర అనేది చాలా విశాలమైంది. ప్రతినాయకుడు ఒకరిని కొట్టి విలనిజం చూపించుకోవాలని ఏమీ లేదు. మెదడు ద్వారా ఆలోచిస్తూ టాక్టికల్‌గానూ చేయొచ్చు. ప్రతికూల పాత్రలు వస్తే నేను తప్పకుండా చేస్తా.

అదే బాధిస్తుంది...

నేను ఎప్పుడూ నా చదువుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకుంటూ ఉంటా. ఈ లాక్‌డౌన్‌లో కథల గురించి చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 'వకీల్‌ సాబ్‌' షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చా. ఇన్ని రోజులు ఇంటిదగ్గర ఉండటం ఆనందంగా ఉంది. మా నాన్న దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటారు. ఆయన ఇంటికి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఆయన పదిహేడేళ్లలో ఇంటికి రాకుండా ఇంత పెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. ఇది చాలా బాధిస్తుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాని నా కుటుంబ సభ్యుడు..

ట్రైలర్‌ చూశాక నాని పాత్ర గురించి ఎన్నో రకాలుగా ఊహించుకుంటున్నారు. ఆ పాత్ర ఎలా ఉన్నా... ఆయన వ్యక్తిగతంగా నాకో కుటుంబ సభ్యునిలా ఉంటారు. 'జెంటిల్‌మెన్‌'కి ఇప్పటికీ మా అనుబంధంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చితే నేను దాన్ని నానితో పంచుకుంటా. కొత్త విషయాలు నేర్చుకుంటుంటా.

చాలా కష్టపడ్డాం...

సినిమాను థియేటర్లో విడుదల చేయాలనే మేమంతా కష్టపడ్డాం. ఏ సినిమా చేసినా దాన్ని ప్రేక్షకులే కదా చూసేది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇంటి బయట ఉండే దుకాణానికి వెళ్లలేకపోతున్నాం. ఇక థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేదు. అందుకే చిత్రబృందం మొత్తం మాట్లాడుకునే.. ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ చేయడానికి ఎంతో సమయం పట్టింది. ఎంతో కష్టపడి పనిచేశాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.