పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించేది ఎవరు..? ఇదే ప్రశ్న చిత్ర సీమలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' రీమేక్‌తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయం తెలిసిన క్షణం నుంచే పవన్‌కు జోడీ ఎవరు అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు సినీ అభిమానులు. ఈ నేపథ్యంలోనే నయనతార, పూజా హెగ్డేతోపాటు సమంత పేరు వినిపించింది. ఇప్పుడు మరో యువ కథానాయిక పవన్‌తో నటించే అవకాశం అందుకుందని ప్రచారం సాగుతోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నివేదా థామస్. 'జెంటిల్‌మన్' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నివేదా 'నిన్నుకోరి', 'బ్రోచేవారెవరురా'లో నటిగా మంచి గుర్తింపు పొందింది. 'పింక్' సినిమాలో నాయికా పాత్రకు నివేదానే సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ ప్రచారం నివేదాతో ఆగుతుందా, మరో కథానాయిక పేరు వినిపిస్తుందా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్‌ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి.. బ్రేకింగ్.. పవన్ 'పింక్' మొదలైంది..!