విభిన్న కథాంశాలను ఎంచుకునే నితిన్.. త్వరలో భీష్మగా అలరించనున్నాడు. ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రష్మిక మందణ్న కథానాయిక. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకొంది. నితిన్‌తో పాటు రష్మిక మందణ్న, దర్శక, నిర్మాతలు హాజరయ్యారు.
'భీష్మ' అనే టైటిల్‌కు 'సింగిల్ ఫర్ ఎవర్' అనేది ఉపశీర్షిక. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలనుకునే అబ్బాయికి ఓ అమ్మాయి ఎలా జ్ఞానోదయం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది.
ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నితిన్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.